రూ.లక్షన్నరకే జీప్.. బైక్ ఇంజిన్‌తో తయారు చేసిన మెకానిక్
లక్షన్నర రూపాయల బడ్జెట్.. నలుగురు దర్జాగా కూర్చుని ప్రయాణించే వీలు.. లీటరు పెట్రోల్‌కు 30 కి.మీ. మైలేజ్.. వింటుంటూనే ఔరా అనిపించేలా ఉన్న ప్రత్యేకతలతో మినీ జీప్ తయారు చేశారు బిహార్‌కు చెందిన ఓ సాధారణ
లక్షన్నర రూపాయల బడ్జెట్.. నలుగురు దర్జాగా కూర్చుని ప్రయాణించే వీలు.. లీటరు పెట్రోల్‌కు 30 కి.మీ. మైలేజ్.. వింటుంటూనే ఔరా అనిపించేలా ఉన్న ప్రత్యేకతలతో మినీ జీప్ తయారు చేశారు బిహార్‌కు చెందిన ఓ సాధారణ మెకానిక్. బేతియాలో నివసించే లోహా సింగ్ లాక్డౌన్ సమయంలో ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు క్లాసిక్ జీప్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. సెకెండ్ హ్యాండ్ సీబీజీ బైక్ తీసుకొని..దాని నుంచి ఇంజిన్‌ను వేరు చేశారు. టెంపో భాగాలను తీసుకొచ్చి 150 సీసీ ఇంజిన్ ఉన్న నాలుగు సీట్ల మినీ క్లాసిక్ జీప్‌గా మార్చారు. ఇందుకు 50 రోజుల సమయం పట్టింది. ఆరు గేర్లున్న జీప్ లీటర్ పెట్రోల్‌కు 30 కి.మీ మైలేజ్ ఇస్తోందని, గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని లోహా సింగ్ తెలిపారు. సెల్ఫ్ స్టార్ట్ చేసుకోవచ్చని వెల్లడించారు. క్లాసిక్ జీప్‌లోని పవర్ టిల్లర్ చక్రాలు.. నీటితో నిండిన రోడ్లపైనా సాఫీగా దూసుకుపోగలదని అంటున్నారు. తయారీకి రూ.1.5 లక్షలు ఖర్చయిందని వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్