Chocolate: చాక్లెట్‌ కోసం నది ఈది.. సరిహద్దు దాటి భారత్‌లోకి..

బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలుడు తనకు నచ్చిన చాక్లెట్‌ కొనుక్కోవడానికి పెద్ద సాహసమే చేశాడు. నదిని ఈదుకుంటూ దాటి, సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన కంచెను దాటుకుని భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఆ తర్వాత అతడికి

Updated : 16 Apr 2022 08:08 IST

జైలుపాలైన బంగ్లాదేశ్‌ బాలుడు 

బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలుడు తనకు నచ్చిన చాక్లెట్‌ కొనుక్కోవడానికి పెద్ద సాహసమే చేశాడు. నదిని ఈదుకుంటూ దాటి, సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన కంచెను దాటుకుని భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఆ తర్వాత అతడికి ఊహించని షాక్‌ తగిలింది. సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది అతణ్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వారు ఆ బాలుణ్ని స్థానిక కోర్టులో హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్‌ విధించింది. భారత్‌-బంగ్లాదేశ్‌కు సరిహద్దులో ఉండే షాల్డా నది సమీపంలోని ఓ గ్రామంలో ఉంటాడతడు. భారత్‌లో దొరికే చాక్లెట్లు అంటే అతనికి చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు వాటి కోసం త్రిపుర సిపాహీజలా జిల్లాలోని కలామ్‌చౌరా గ్రామానికి వస్తుండేవాడు. ముందు షాల్డా నదిని ఈది, భారత్‌ వైపునకు వచ్చేవాడు. దగ్గర్లోని దుకాణంలో చాక్లెట్లు కొనుక్కుని అదే దారిలో తిరిగి వెళ్లిపోయేవాడు. ఈ నెల 13న మరోసారి సరిహద్దు దాటి  అరెస్టయ్యాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని