Supreme Court: ఉద్యోగమా.. న్యాయవృత్తా?ఆరు నెలల్లో తేల్చుకోవాలి: సుప్రీం

ఇతర ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులూ బార్‌ కౌన్సిల్‌లో తమ పేరు నమోదు చేసుకోవచ్చు. అయితే వారు ఆల్‌ ఇండియా బార్‌ ఎగ్జామినేషన్‌(ఏఐబీఈ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత ఆరు నెలల్లో న్యాయవాద వృత్తిలో కొనసాగుతారా

Published : 22 Apr 2022 07:06 IST

దిల్లీ: ఇతర ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులూ బార్‌ కౌన్సిల్‌లో తమ పేరు నమోదు చేసుకోవచ్చు. అయితే వారు ఆల్‌ ఇండియా బార్‌ ఎగ్జామినేషన్‌(ఏఐబీఈ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత ఆరు నెలల్లో న్యాయవాద వృత్తిలో కొనసాగుతారా లేదా ఇతర ఉద్యోగంలోనే ఉంటారో నిర్ణయించుకోవాలి. ఇతర వృత్తులు చేస్తున్న వారు కూడా న్యాయవాదులుగా ప్రాక్టీస్‌ చేయొచ్చంటూ గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వేసిన పిటిషన్‌పై ఈ మేరకు సుప్రీం కోర్టు గురువారం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని