హిజాబ్‌ వద్దన్నారని.. పరీక్ష రాయలేదు

హిజాబ్‌ ధరించి మాధ్యమిక విద్య(ఇంటర్మీడియట్‌) పరీక్ష రాయడానికి అనుమతి నిరాకరించడంతో ఇద్దరు విద్యార్థినులు ఇంటికి వెళ్లిపోయారు. ఈ సంఘటన ఉడుపి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇద్దరు

Published : 23 Apr 2022 05:04 IST

ఇంటికి వెళ్లిపోయిన ఇద్దరు విద్యార్థినులు

ఉడుపి, న్యూస్‌టుడే: హిజాబ్‌ ధరించి మాధ్యమిక విద్య(ఇంటర్మీడియట్‌) పరీక్ష రాయడానికి అనుమతి నిరాకరించడంతో ఇద్దరు విద్యార్థినులు ఇంటికి వెళ్లిపోయారు. ఈ సంఘటన ఉడుపి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థినులు హిజాబ్‌తో కళాశాలకు వచ్చారు. లోనికి వెళ్లిన తరువాత ప్రిన్సిపాల్‌తో దాదాపు అరగంటకు పైగా చర్చించారు. తాము హిజాబ్‌తోనే పరీక్ష రాస్తామని స్పష్టం చేయడంతో అందుకు వారు ససేమిరా అన్నారు. ప్రత్యేక గదిలో కూర్చుని పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు కూడా కళాశాల యాజమాన్యం నిరాకరించడంతో హాల్‌ టికెట్లు తీసుకున్నా పరీక్ష రాయకుండా ఇంటికి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థినులు హిజాబ్‌తో కళాశాలల వరకు వచ్చినా.. అక్కడ తొలగించి లోనికి వెళ్లడం కనిపించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని