Updated : 24 Apr 2022 07:35 IST

Crime News: రూ.100 కోసం కన్నతల్లినే చంపిన కుమారుడు

కటక్‌, న్యూస్‌టుడే: సారాకు బానిసైన కుమారుడు రూ.100 ఇవ్వలేదని కన్నతల్లినే కొట్టి చంపాడు. ఈ ఘటన ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా జాసిపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. హటపడియా గ్రామానికి చెందిన శాలందీ నాయక్‌(55) కుమారుడు సరోజ్‌ శుక్రవారం రాత్రి సారా తాగి ఆ మత్తులో ఇంటికి వచ్చాడు. మళ్లీ తాగేందుకు తల్లిని రూ.100 అడిగాడు. ఇప్పటికే బాగా తాగావు మళ్లీ డబ్బెందుకని తల్లి ప్రశ్నించింది. దీంతో సరోజ్‌ కర్రతో ఆమెను కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై శాలందీ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. శనివారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని