Andhra- Odisha: ఆంధ్రా నుంచి కోడిగుడ్ల దిగుమతికి ఒప్పుకోం

ఆంధ్రా నుంచి కోడిగుడ్లు దిగుమతి కావడంతో తమ రాష్ట్రంలో గుడ్ల ధరలు పడిపోతున్నాయని పేర్కొంటూ ఒడిశాలోని ఆల్‌ ఒడిశా పౌల్ట్రీ వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఖుర్ధా ప్రాంతంలోని

Updated : 28 Apr 2022 08:12 IST

ఒడిశా పౌల్ట్రీ వ్యాపారుల సంఘం రాస్తారోకో

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఆంధ్రా నుంచి కోడిగుడ్లు దిగుమతి కావడంతో తమ రాష్ట్రంలో గుడ్ల ధరలు పడిపోతున్నాయని పేర్కొంటూ ఒడిశాలోని ఆల్‌ ఒడిశా పౌల్ట్రీ వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఖుర్ధా ప్రాంతంలోని జాతీయ రహదారిపై మంగళవారం, బుధవారం రెండు రోజులు బైఠాయించారు. దీంతో ఆంధ్రాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఒడిశా, బెంగాల్‌, మేఘాలయ రాష్ట్రాలకు కోడిగుడ్లతో వెళుతున్న లారీలు రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మంగళవారం పోలీసులు వ్యాపారులతో మాట్లాడి సర్దిచెప్పడంతో రాస్తారోకో విరమించారు. అయితే వ్యాపారులు బుధవారం మళ్లీ కూర్చోవడంతో పరిస్థితి మొదటికివచ్చింది. సంఘం అధ్యక్షుడు మానస్‌ మంగరాజు మాట్లాడుతూ ఆంధ్రా నుంచి గుడ్లు వస్తుండడంతో రాష్ట్రంలో పౌల్ట్రీ వ్యాపారులు నష్టపోతున్నారని, ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ప్రభుత్వం హామీ ఇచ్చేంతవరకు బైఠాయిస్తామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని