వారంలోపు సమాధానమివ్వండి

రాజద్రోహం చట్టం రాజ్యాంగబద్ధతపై దాఖలైన వ్యాజ్యాలపై తన స్పందనను వారంలో తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేంద్రానికి స్పష్టంచేసింది. వాయిదా కోరుతూ చేసే ఎలాంటి

Updated : 28 Apr 2022 05:19 IST

మే 5న తుది విచారణ చేస్తాం
‘రాజద్రోహం’ వ్యాజ్యాలపై కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: రాజద్రోహం చట్టం రాజ్యాంగబద్ధతపై దాఖలైన వ్యాజ్యాలపై తన స్పందనను వారంలో తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేంద్రానికి స్పష్టంచేసింది. వాయిదా కోరుతూ చేసే ఎలాంటి అభ్యర్థనలు స్వీకరించమని పేర్కొంది. మే 5న ఈ వ్యాజ్యాలపై తుది విచారణ చేస్తామని తెలిపింది. బుధవారం విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ పారిక్‌.. పీయూసీఎల్‌ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ‘‘మీకు సమస్య పరిష్కారం కావాలా, పిటిషన్లన్నీ విచారణకు స్వీకరించడం కావాలా’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా తదితరులు దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని స్వీకరిస్తూ.. గత ఏడాది జులైలో ఈ చట్టం భారీగా దుర్వినియోగమవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణిచివేయడానికి గాంధీ లాంటి నాయకులపై బ్రిటిషర్లు ప్రయోగించిన ఈ చట్టాన్ని ఎందుకు రద్దు చేయడం లేదో కేంద్రం సమాధానం చెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని