Omicron: ఎలుకల నుంచి మానవుల్లోకి ఒమిక్రాన్‌?

కరోనా మహమ్మారి వ్యాప్తిలో జంతువుల పాత్ర ఎంత మాత్రమూ విస్మరించలేనిదని అమెరికా పరిశోధకులు తాజాగా తేల్చారు. కొత్త వేరియంట్లకు అవి రిజర్వాయర్లుగా పనిచేస్తుంటాయని పేర్కొన్నారు. మూడో ఉద్ధృతిలో భారత్‌ సహా దాదాపు ప్రపంచమంతటా

Updated : 29 Apr 2022 07:46 IST

 ప్రాణాంతక వేరియంట్లకు జంతువులు

  రిజర్వాయర్లుగా మారే ముప్పుందన్న శాస్త్రవేత్తలు

దిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిలో జంతువుల పాత్ర ఎంత మాత్రమూ విస్మరించలేనిదని అమెరికా పరిశోధకులు తాజాగా తేల్చారు. కొత్త వేరియంట్లకు అవి రిజర్వాయర్లుగా పనిచేస్తుంటాయని పేర్కొన్నారు. మూడో ఉద్ధృతిలో భారత్‌ సహా దాదాపు ప్రపంచమంతటా కొవిడ్‌ కేసులు అత్యంత వేగంగా పెరిగేందుకు కారణమైన ఒమిక్రాన్‌ వేరియంట్‌.. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తిలో ఉత్పరివర్తనాల వల్ల పుట్టుకొచ్చింది కాదేమోనని అభిప్రాయపడ్డారు. జంతువుల నుంచే (బహుశా ఎలుకలు వంటి వాటి నుంచి) మానవుల్లోకి అది ప్రవేశించి ఉంటుందని అంచనా వేశారు. జంతువుల్లో కరోనా వైరస్‌ వేల సంఖ్యలో ఉత్పరివర్తనాలకు గురవుతూ.. మనుషుల్లో శరవేగంగా వ్యాప్తి చెందే రకంగా, అత్యంత ప్రాణాంతక వేరియంట్‌గా పరివర్తనం చెందేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు అమెరికాకు చెందిన ప్రజారోగ్య నిపుణులు అమితా గుప్తా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని