పటియాలాలో ఘర్షణ.. కర్ఫ్యూ

పంజాబ్‌లోని పటియాలాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి రాళ్లు రువ్వుకోవడంతో నగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు కర్ఫ్యూ విధించారు. శివసేన (బాల్‌ ఠాక్రే) వర్గంగా ప్రకటించుకొన్న

Published : 30 Apr 2022 05:46 IST

గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు

పటియాలా: పంజాబ్‌లోని పటియాలాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి రాళ్లు రువ్వుకోవడంతో నగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు కర్ఫ్యూ విధించారు. శివసేన (బాల్‌ ఠాక్రే) వర్గంగా ప్రకటించుకొన్న ఓ బృందం ఖలిస్థాన్‌ వ్యతిరేక మార్చ్‌ జరుపగా.. కొంతమంది సిక్కులు దీనికి అభ్యంతరం తెలుపుతూ పోటీ ర్యాలీ నిర్వహించారు. కాళీమాత ఆలయం వద్ద ఎదురుపడిన రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి, రాళ్లు రువ్వుకున్నారు. ఓ పోలీసు, మరో ముగ్గురు గాయపడ్డారు. పెద్దసంఖ్యలో అక్కడ మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గాలిలోకి కాల్పులు జరిపారు. ఏప్రిల్‌ 29న ఖలిస్థాన్‌ వ్యవస్థాపక దినోత్సవంగా గుర్తించాలని కొందరు సిక్కులు పిలుపునివ్వడంతో తాము ఈ ర్యాలీ నిర్వహించినట్లు శివసేన నేత ఒకరు తెలిపారు. ఘటనపై స్పందించిన పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఇలా జరగడం చాలా దురదృష్టకరమని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.  పటియాలా పరిణామాలపై నివేదిక పంపాల్సిందిగా జాతీయ మైనార్టీ కమిషన్‌ (ఎన్‌సీఎం) పంజాబ్‌ చీఫ్‌ సెక్రటరీని కోరింది. పోలీసులు శివసేన (బాల్‌ ఠాక్రే) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హరీశ్‌ సింగ్లాను అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని