DGCA: స్పైస్‌జెట్‌ విమానాలన్నింటినీ తనిఖీ చేస్తాం

ముంబయి-దుర్గాపుర్‌ స్పైస్‌జెట్‌ విమాన ప్రమాద ఘటనపై పౌర విమానయానశాఖ డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. మొత్తం ఆ సంస్థ విమానాలన్నింటినీ తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గురైన

Published : 03 May 2022 08:02 IST

దుర్గాపుర్‌ ఘటనపై డీజీసీఏ ప్రకటన

దిల్లీ: ముంబయి-దుర్గాపుర్‌ స్పైస్‌జెట్‌ విమాన ప్రమాద ఘటనపై పౌర విమానయానశాఖ డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. మొత్తం ఆ సంస్థ విమానాలన్నింటినీ తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గురైన విమానంలోని సిబ్బంది, ఎయిర్‌క్రాఫ్ట్‌ నిర్వహణ ఇంజనీర్‌ (ఏఎంఈ), స్పైస్‌జెట్‌ మెయింటెనెన్స్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జ్‌ను విధుల నుంచి తప్పించింది. ఆదివారం దుర్గాపుర్‌లో ల్యాండయ్యేముందు స్పైస్‌జెట్‌ బోయింగ్‌ బి-737 విమానం భారీగా కుదుపులకు లోనైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది గాయాలపాలయ్యారు. ఇందులో ఇద్దరు ఐసీయూలో ఉన్నట్లు డీజీసీఏ తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో 195 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ఈ విమానం కోల్‌కతా విమానాశ్రయంలో ఉంది. స్పైస్‌జెట్‌ వెబ్‌సైట్‌ ప్రకారం... ప్రస్తుతం ఆ సంస్థ అధీనంలో 91 విమానాలు ఉన్నాయి. వీటన్నింటిని డీజీసీఏ తనిఖీ చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని