కొవోవాక్స్‌ డోసు ధర రూ.225కి తగ్గింపు

ప్రైవేట్‌ కేంద్రాల్లో 12-17 ఏళ్ల పిల్లలకు టీకాలు వేయడానికి ఉద్దేశించిన కొవోవాక్స్‌ డోసు ధరను రూ.900 నుంచి రూ.225కి తగ్గిస్తున్నట్లు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. అయితే దీనికి జీఎస్టీ, సేవా పన్ను అదనమని వెల్లడించింది.

Published : 04 May 2022 05:58 IST

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా

దిల్లీ: ప్రైవేట్‌ కేంద్రాల్లో 12-17 ఏళ్ల పిల్లలకు టీకాలు వేయడానికి ఉద్దేశించిన కొవోవాక్స్‌ డోసు ధరను రూ.900 నుంచి రూ.225కి తగ్గిస్తున్నట్లు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. అయితే దీనికి జీఎస్టీ, సేవా పన్ను అదనమని వెల్లడించింది. మంగళవారం ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం.

దేశంలో అందుబాటులోకి..

12-17 ఏళ్ల పిల్లలకు సంబంధించిన కొవోవాక్స్‌ టీకా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉందని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అధర్‌ పూనావాలా తెలిపారు. భారత్‌లో తయారై ఐరోపాలో కూడా విక్రయించిన ఏకైక టీకా ఇదేనని ఈ మేరకు ఆయన మంగళవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ టీకా 90శాతం కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని