పెరిగినవన్నీ కొవిడ్‌ మరణాలు కాదు

దేశంలో 2019తో పోలిస్తే 2020లో మరణాలు పెరిగాయని, అయితే ఇవన్నీ కొవిడ్‌ మరణాలు కాదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకేపాల్‌ మంగళవారం మీడియాతో పేర్కొన్నారు. ఈ సంఖ్య 2018తో పోలిస్తే 2019లో ఇంకా ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.

Published : 04 May 2022 05:58 IST

నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌

ఈనాడు, దిల్లీ: దేశంలో 2019తో పోలిస్తే 2020లో మరణాలు పెరిగాయని, అయితే ఇవన్నీ కొవిడ్‌ మరణాలు కాదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకేపాల్‌ మంగళవారం మీడియాతో పేర్కొన్నారు. ఈ సంఖ్య 2018తో పోలిస్తే 2019లో ఇంకా ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. 2018తో పోలిస్తే 2019లో 6.9 లక్షల మరణాలు పెరిగినట్లు గుర్తు చేశారు. అందువల్ల 2020లో మరణాల్లో అసాధారణ వృద్ధి ఏమీ కనిపించలేదని విశ్లేషించారు. ఇందులో సహజ మరణాలతో పాటు, విభిన్నమైన అనారోగ్య కారణాలతో సంభవించినవీ ఉన్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని