నక్సల్స్‌ చేతిలో అత్యాధునిక గ్రెనేడ్‌ లాంఛర్లు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్‌ జిల్లా మారుమూల ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటుచేసిన సీఆర్పీఎఫ్‌ శిబిరాలపై నక్సలైట్లు అత్యాధునిక గ్రెనేడ్‌ లాంఛర్లతో దాడికి దిగుతున్నారని అధికారులు బుధవారం వెల్లడించారు.

Published : 05 May 2022 06:06 IST

ఛత్తీస్‌గఢ్‌ సీఆర్‌పీఎఫ్‌ శిబిరాలే లక్ష్యం

దిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్‌ జిల్లా మారుమూల ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటుచేసిన సీఆర్పీఎఫ్‌ శిబిరాలపై నక్సలైట్లు అత్యాధునిక గ్రెనేడ్‌ లాంఛర్లతో దాడికి దిగుతున్నారని అధికారులు బుధవారం వెల్లడించారు. ‘బ్యారెల్‌ గ్రెనేడ్‌ లాంఛర్లు’గా పిలిచే వీటిని గత ఆర్నెల్లలో దాదాపు 100 - 150 వరకు సీఆర్పీఎఫ్‌ శిబిరాలపై ప్రయోగించినట్లు తెలిపారు. వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ దాడులు తరచూ జరుగుతున్నాయి. ఈ దాడుల తీవ్రత రాను రాను పెరుగుతోంది. రాష్ట్రంలోని కంకేర్‌, రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాల్లో మోహరించిన బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ దళాలపై గతంలో ఈ విధమైన దాడులు జరిగాయి. పాత గ్రెనేడ్‌ లాంఛర్లు తయారీ లోపాల కారణంగా కొన్ని సందర్భాల్లో పేలేవి కావు. మావోయిస్టులు ఉపయోగిస్తున్న అత్యాధునిక గ్రెనేడ్లపై సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆరా తీస్తున్నట్లు అధికారి వెల్లడించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని