మంత్రి గారూ.. కిక్కు ఎక్కట్లేదండీ: రాష్ట్ర హోంమంత్రికే ఫిర్యాదు

తాను కొనుగోలు చేసిన లిక్కర్‌ కిక్కు ఇవ్వట్లేదని, కల్తీ జరిగిందంటూ ఓ మందుబాబు ఏకంగా రాష్ట్ర హోంమంత్రికే ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఉజ్జయిన్‌లోని బహదుర్‌ గంజ్‌కు చెందిన

Published : 09 May 2022 08:06 IST

తాను కొనుగోలు చేసిన లిక్కర్‌ కిక్కు ఇవ్వట్లేదని, కల్తీ జరిగిందంటూ ఓ మందుబాబు ఏకంగా రాష్ట్ర హోంమంత్రికే ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఉజ్జయిన్‌లోని బహదుర్‌ గంజ్‌కు చెందిన లోకేశ్‌ సోథియా ఏప్రిల్‌ 12న నగరంలోని ఓ మద్యం దుకాణంలో నాలుగు క్వార్టర్‌ బాటిళ్లు కొన్నాడు. స్నేహితుడితో కలిసి రెండు సీసాలు ఖాళీ చేశాడు. బాటిల్‌ మూత తీసినప్పుడు మద్యం వాసన రాకపోవటం, రెండు సీసాలు ఖాళీ అయినా కిక్కు ఎక్కకపోవటంతో కల్తీ జరిగినట్లు భావించాడు. మిగతా రెండు బాటిళ్లు సీల్‌ తీయకుండా ఆధారం కోసం దాచిపెట్టాడు. ‘20 ఏళ్లుగా మద్యం తాగుతున్నా.. దాని స్వచ్ఛత, రుచి నాకు తెలుసు’ అంటూ మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రాకు, ఉజ్జయిన్‌ అబ్కారీ శాఖ కమిషనర్‌ ఇందర్‌సింగ్‌ దమోర్‌కు కల్తీపై ఫిర్యాదు చేశాడు. వినియోగదారుల ఫోరంలోనూ ఛీటింగ్‌ కేసు నమోదు చేస్తామని సోథియా న్యాయవాది నరేంద్రసింగ్‌ ధక్డే తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని