Published : 11 May 2022 06:41 IST

సామాజిక మాధ్యమాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే

ప్రభుత్వ వర్గాల స్పష్టీకరణ

దిల్లీ: సామాజిక మాధ్యమ వేదికలు పూర్తి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. యాజమాని ఎవరన్నదానితో సంబంధం లేకుండా ఆయా సంస్థలన్నీ స్థానిక చట్టాలకు లోబడి పనిచేయాలని పేర్కొన్నాయి. కొన్ని శాసనాలు/నిబంధనల నుంచి వాటికి మినహాయింపునివ్వడమన్నది ప్రస్తుత ప్రపంచంలో సాధ్యం కాదని అభిప్రాయపడ్డాయి. సైబర్‌ భద్రత, సురక్షిత అంతర్జాలం, సామాజిక మాధ్యమాల జవాబుదారీతనం, డేటా పరిరక్షణ వంటి అంశాలకు సంబంధించి భారత ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతర్జాలం, సామాజిక మాధ్యమాలు, డిజిటల్‌ ప్రపంచం ఇప్పుడు మానవ జీవితాల్లో అంతర్భాగంగా మారాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయా సంస్థలు జవాబుదారీతనంతో వ్యవహరిస్తేనే.. వినియోగదారులకు ముప్పులు తగ్గుతాయని, డిజిటల్‌ విధానాలతో ప్రయోజనాలు పొందగలుగుతారని వ్యాఖ్యానించాయి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఐటీ చట్టం మారాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని