భర్తను కోల్పోయి.. 30 ఏళ్లుగా ఆమె అతడుగా..

భర్తను కోల్పోయిన ఓ మహిళ 30 సంవత్సరాలుగా పురుషుడి వేషధారణలో జీవిస్తున్న ఘటనిది. తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా కాట్టునాయక్కన్‌పట్టి గ్రామంలో ఉంటున్న ముత్తు మాస్టర్‌ లుంగీ, చొక్కా ధరించి

Updated : 13 May 2022 08:47 IST

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: భర్తను కోల్పోయిన ఓ మహిళ 30 సంవత్సరాలుగా పురుషుడి వేషధారణలో జీవిస్తున్న ఘటనిది. తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా కాట్టునాయక్కన్‌పట్టి గ్రామంలో ఉంటున్న ముత్తు మాస్టర్‌ లుంగీ, చొక్కా ధరించి పురుషుడిలా కనిపిస్తుంది. ఆమె అసలు పేరు పేచ్చియమ్మాల్‌ (60). 30 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకే గుండెపోటుతో భర్త మృతి చెందాడు. అప్పటికే ఆమె గర్భం దాల్చింది. అనంతరం ఆడబిడ్డకు పేచ్చియమ్మాల్‌ జన్మనిచ్చింది. కుటుంబాన్ని పోషించేందుకు కూలి పనులకు వెళ్లిన ఆమెకు పురుషుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. దీంతో తనతోపాటు కుమార్తెను కాపాడుకునేందుకు చొక్కా, లుంగీ ధరించడం అలవాటు చేసుకుంది. జుట్టునూ పురుషుల మాదిరిగా కత్తిరించుకుంటుంది. పలు హోటళ్లు, చెన్నైలోని టీ దుకాణంలో పని చేసింది. ఆమెను అందరూ ముత్తు మాస్టర్‌ అని పిలుస్తుండటంతో తన పేరును ముత్తుగా మార్చుకుంది. ప్రస్తుతం ఆమె రంగులు వేయడం, ఉపాధి హమీ పనులకు వెళ్తూ జీవనం గడుపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని