గోధుమ ఎగుమతులపై నిషేధం

దేశంలో పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం గోధుమ ఎగుమతులను నిషేధించింది. ఈ మేరకు శుక్రవారం(ఈనెల 13న) నోటిఫికేషన్‌ జారీచేసింది. అయితే, ఈ తేదీకి ముందు గోధుమల

Published : 15 May 2022 05:37 IST

కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ జారీ

దిల్లీ: దేశంలో పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం గోధుమ ఎగుమతులను నిషేధించింది. ఈ మేరకు శుక్రవారం(ఈనెల 13న) నోటిఫికేషన్‌ జారీచేసింది. అయితే, ఈ తేదీకి ముందు గోధుమల ఎగుమతి కోసం జారీ చేసిన లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను గౌరవిస్తామని ప్రకటించింది. కొవిడ్‌, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్న కొన్ని దేశాలకు గోధుమలను ఎగుమతి చేస్తామని గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని విదేశీ వాణిజ్య కార్యాలయం (డి.జి.ఎఫ్‌.టి) భరోసా ఇచ్చింది. జూన్‌తో అంతమయ్యే 2021-22 పంట సంవత్సరంలో భారత్‌లో గోధుమ ఉత్పత్తి అంచనాను కేంద్రం 5.7 శాతం తగ్గించింది. ఈ ఏడాది త్వరగా వేసవి ప్రవేశించడం వల్ల పంట దిగుబడి తగ్గడం దీనికి కారణం. ఫలితంగా ఈ పంట సంవత్సరంలో గోధుమ ఉత్పత్తి.. ముందుగా అనుకున్నట్లు 11.14 కోట్ల టన్నులు కాకుండా 10.5 కోట్ల టన్నులుగా ఉండబోతోందని అంచనా వేసింది. 2020-21 పంట సంవత్సరంలో మనదేశంలో గోధుమ ఉత్పత్తి  10.96 కోట్ల టన్నులు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 70 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేయగా, ఈ ఏడాది కోటి టన్నులు ఎగుమతి చేయాలని లక్షిస్తోంది.

రైతులకు నష్టదాయకం

గోధుమ ఎగుమతులను ప్రభుత్వం నిషేధించడం రైతులపై పరోక్ష పన్ను విధించడం కిందకు వస్తుందని భారత్‌ కృషక్‌ సమాజ్‌ (బీకేఎస్‌) శనివారం అసంతృప్తి వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని