హిందీకి శివసేన మద్దతు

‘ఒకే దేశం.. ఒకే భాష’ నినాదాన్ని శివసేన ప్రధాన ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ సమర్థించారు. హిందీని దేశమంతటా ఆమోదిస్తారని, అన్ని రాష్ట్రాల్లో హిందీ మాట్లాడేట్టు చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఆయన కోరారు.

Published : 15 May 2022 05:37 IST

ముంబయి: ‘ఒకే దేశం.. ఒకే భాష’ నినాదాన్ని శివసేన ప్రధాన ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ సమర్థించారు. హిందీని దేశమంతటా ఆమోదిస్తారని, అన్ని రాష్ట్రాల్లో హిందీ మాట్లాడేట్టు చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఆయన కోరారు. అన్ని రాష్ట్రాల్లో ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా హిందీని ఆమోదించాలన్నదే తన ఉద్దేశం తప్ప, స్థానిక భాషలకు ప్రత్యామ్నాయంగా మాత్రం కాదని అమిత్‌ షా పేర్కొన్న నెల రోజులకు రౌత్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

కేంద్రం తమపై హిందీని రుద్ధాలని చూస్తోందనీ, ఇది ప్రాంతీయ భాషలను బలహీనపరచే అజెండాలో భాగమని దక్షిణ భారత రాష్ట్రాల నాయకులు విమర్శిస్తున్నారు. హిందీ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయనే కేంద్ర నాయకుల వాదనను వారు ఖండించారు. ‘‘కోయంబత్తూరులో పానీపూరి అమ్మేవారు ఎవరు? వారికి నిజంగా హిందీ వల్ల ఉద్యోగాలు వస్తే... ఆ చిన్న వ్యాపారం ఎందుకు చేస్తారు?’’ అని తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి ఇటీవల ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని