CCTV camera: నాగ్‌పుర్‌ జైలు మరుగుదొడ్లో సీసీ కెమెరా నిఘా!

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో నాగ్‌పుర్‌ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.ఎన్‌.సాయిబాబా

Updated : 16 May 2022 09:36 IST

నిరాహారదీక్ష చేస్తానన్న ప్రొఫెసర్‌ సాయిబాబా

నాగ్‌పుర్‌: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో నాగ్‌పుర్‌ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.ఎన్‌.సాయిబాబా నిరవధిక నిరాహారదీక్ష చేస్తానంటూ జైలు అధికారులను ఇటీవల హెచ్చరించిన విషయం బయటికి వెల్లడైంది. జైలులో తాను ఉంటున్న గదిలోని మరుగుదొడ్డి, స్నానాల ప్రాంతంలో పెట్టిన సీసీ కెమెరా ఫుటేజి తొలగించకపోతే దీక్షకు దిగడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఈ విషయమై సాయిబాబా భార్య వసంతకుమారి, సోదరుడు జి.రామదేవుడు మహారాష్ట్ర హోం మంత్రికి ఫిర్యాదు చేస్తూ మే 14న ఓ లేఖ రాశారు. జైలుశిక్ష అనుభవిస్తున్న సాయిబాబా గోప్యతకు, గౌరవానికి భంగం కలగకుండా చూడాలని అందులో కోరారు. నాగ్‌పుర్‌ సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ అనూప్‌ కుమ్రే ఈ ఆరోపణలకు ఆదివారం వివరణ ఇచ్చారు. అండాకారంలో ఉన్న జైలు గదుల్లోని ఖైదీలు అందరిపై నిఘా కోసం ఆ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని