కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరేంటో స్పష్టం చేయాలి

దేశంలోని ముస్లిం ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరేంటో స్పష్టం చేయాలని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) కోరింది. జ్ఞానవాపి

Published : 19 May 2022 05:21 IST

ప్రార్థనా మందిరాల వివాదంపై ప్రశ్నించిన అఖిలభారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు

లఖ్‌నవూ: దేశంలోని ముస్లిం ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరేంటో స్పష్టం చేయాలని ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) కోరింది. జ్ఞానవాపి మసీదు కేసులో ఇంతేజామియా మసీదు కమిటీలకు న్యాయ సహాయం అందించాలని బోర్డు నిర్ణయించింది. ప్రార్థనా మందిరాల వివాదంపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైతే దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. బోర్డు వర్కింగ్‌ కమిటీ మంగళవారం రాత్రి అత్యవసరంగా వర్చువల్‌ మీటింగ్‌ నిర్వహించింది. సమావేశంలో చర్చించిన అంశాలను కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు ఖాసిం రసూల్‌ ఇలియాస్‌ బుధవారం వెల్లడించారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మథురలోని షాహి మసీదు ఈద్గా వివాదం అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిపారు. దేశంలోని ముస్లిం ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేయడంపై సభ్యులు విచారం వ్యక్తం చేసినట్లు రసూల్‌ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు లౌకికవాదులమని చెప్పుకొనే పార్టీలు సైతం మౌనం వహించడం విచారకరమన్నారు. వాటి వైఖరేంటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని