అనాసపండుతో అల్జీమర్స్‌కు అడ్డుకట్ట!

అనాసపండు (పైనాపిల్‌)లో ఉండే ‘బ్రొమెనైల్‌’ సమ్మేళనం అల్జీమర్స్‌ను సమర్థంగా నియంత్రించగలదని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్‌

Published : 19 May 2022 06:48 IST

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ పరిశోధన

దిల్లీ: అనాసపండు (పైనాపిల్‌)లో ఉండే ‘బ్రొమెనైల్‌’ సమ్మేళనం అల్జీమర్స్‌ను సమర్థంగా నియంత్రించగలదని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ నిపుణులు ఎలుకలపై విజయవంతంగా ప్రయోగాలు చేపట్టారు. పరిశోధనలో భాగంగా కొన్ని ఎలుకలకు నిపుణులు ఏఐసీఐ3, డీ-గెలాక్టోస్‌ సమ్మేళనం ఇవ్వడం ద్వారా వాటికి కృత్రిమంగా అల్జీమర్స్‌ తెప్పించారు. తర్వాత వాటిలో వచ్చిన మార్పులను గమనించారు. కొద్దిరోజుల తర్వాత వాటికి అనాసపండులో ఉండే బ్రొమెలైన్‌తో చికిత్స అందించారు. దీంతో వాటి మెదడులో నాడీకణాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే ఎసిటైల్‌కోలినెస్టెరేస్‌ అనే ఎంజైమ్‌తో పాటు... యాంటీ ఆక్సిడెంట్లు, మెదడు పనితీరును మెరుగుపరిచే మరికొన్ని ఎంజైముల స్థాయులు కూడా గణనీయంగా పెరిగినట్టు గుర్తించారు. బ్రొమెలైన్‌ చికిత్స వల్ల ఎలుకల మెదడు కణాల నిర్మాణం కూడా మెరుగుపడినట్టు హిస్టోపాథలాజికల్‌ విశ్లేషణలో తేలిందని పరిశోధనకర్త నవనీత్‌ ఖురానా వివరించారు. రాజన్‌ కుమార్‌, నేహా శర్మ, సచిన్‌ కుమార్‌ సింగ్‌, సౌరభ్‌ సతిజా, మీనూ, మనీశ్‌లు ఈ క్రతువులో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని