
Gyanvapi Masjid: శివలింగమే కాదు.. చాలా విగ్రహాలు ఉన్నాయి
‘జ్ఞానవాపి’ తొలి సర్వేలో ఆసక్తికర విషయాలు
వారణాసి (ఉత్తర్‌ప్రదేశ్): కాశీలోని జ్ఞానవాపి మసీదు సర్వే తొలి నివేదికలో శివలింగం ఉన్నట్లు వెల్లడవ్వడంతో ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు సర్వే నివేదికలోని పలు అంశాలు బహిర్గతమయ్యాయి. నివేదిక ప్రకారం.. మసీదులోకి అడుగుపెట్టిన సర్వే బృందానికి పురాతన ఆలయ శిథిలాలు కనిపించాయి. పలు దేవతా విగ్రహాలు, కమలం నమూనాలు దర్శనమిచ్చాయి. రాతితో రూపొందించిన శేషనాగు శిల్పం, త్రిశూలం, ఢమరుకం, సింధూరి గుర్తులతో నాలుగు విగ్రహాలను కూడా బృందం గుర్తించింది.
‘‘మసీదులో పురాతన ఆలయ శిథిలాలు కనిపించాయి. అందులో దేవతా విగ్రహాలు, కమలం ఆకృతులు, మధ్యలో శేషనాగు, నాగఫణి శిల్పాలు ఉన్నాయి’’ అని నివేదిక పేర్కొంది. దీపారాధనకు సంబంధించిన గుర్తులు సైతం మసీదులో కనుగొన్నట్లు నివేదిక తయారు చేసిన అడ్వకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా తెలిపారు. వీటితో పాటు మసీదు వెనక పడమటి గోడపై కళాత్మక నమూనాలు, రాతి పలకలు కనిపించాయని పేర్కొన్నారు. ఈ నివేదికలో అంశాలు బయటికి వెల్లడి కావడంతో మిశ్రాను కమిషనర్ బాధ్యతల నుంచి వారణాసి కోర్టు తప్పించిన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Movies News
Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
-
World News
Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు
-
Sports News
Mithali Raj: యువ అథ్లెట్లకు మిథాలీ రాజ్ స్ఫూర్తి: ప్రధాని నరేంద్ర మోదీ
-
General News
PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- R Madhavan: మాధవన్‌పై నెటిజన్ల విమర్శలు.. సైన్స్ తెలియకపోతే సైలెంట్‌గా ఉండు..!
- Jamun Health Benefits: నేరేడు పండు తింటున్నారా?ప్రయోజనాలివే!
- AP Liquor: మద్యంలో విషం
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా