
రోజూ ఇల్లు ఊడుస్తున్నారు!
గృహ పరిశుభ్రత విషయంలో భారతీయులు భేష్
ఆసియా పసిఫిక్ దేశాల్లో మనదే ముందంజ
దిల్లీ: గృహ పరిశుభ్రత విషయంలో భారతీయులు ఇటీవలి కాలంలో బాగా మెరుగయ్యారని తాజా సర్వే ఒకటి తేల్చింది. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు దాదాపుగా ప్రతిరోజూ తమ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఇతర దేశాల పౌరులతో పోలిస్తే భారతీయులదే ముందంజ అని వెల్లడించింది. డైసన్ అనే ఓ టెక్నాలజీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 33 దేశాలకు చెందిన 32,282 మందిపై ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో 1,019 మంది భారతీయులు పాల్గొన్నారు.
సర్వేలో గుర్తించిన ముఖ్యాంశాలివీ..
* కరోనా మహమ్మారి భయంతో గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లను తరచుగా శుభ్రం చేసుకున్నారు. 95% మంది ఇప్పటికీ అదే తీరుతో సాగుతున్నారు.
* భారత్‌లో 46% మంది గృహ పరిశుభ్రత విషయంలో మెరుగయ్యారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు వారానికి 5-7 సార్లు తమ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు.
* ప్రపంచవ్యాప్తంగా 40% మంది.. ఇంట్లో దుమ్ము కనిపించిన వెంటనే దాన్ని తొలగిస్తుండగా, భారత్‌లో అలాంటివారి శాతం దాదాపు 33%గా మాత్రమే ఉంది.
* ఇళ్లలోని ధూళి వైరస్‌లను కూడా కలిగి ఉంటుందన్న సంగతి 22% మంది భారతీయులకు తెలియదు.
* ఇంట్లోని దుమ్ము అంటే మట్టి, ఇసుక మాత్రమే అని భారత్‌లో 35% మంది భ్రమపడుతున్నారు.
* భారతీయుల్లో 54% మంది తమ పరుపులను, 72% మంది కర్టెన్లను శుభ్రం చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
PPF loan: పీపీఎఫ్ నుంచి రుణం తీసుకోవాలనుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి..
-
India News
GST: గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఇకనుంచి ‘కుటుంబ సర్వనాశన ట్యాక్స్’
-
Movies News
OTT: 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి సినిమాలు.. నిర్మాత కీలక నిర్ణయం
-
Sports News
Hanuma vihari : మన దగ్గర పోటీ ఎక్కువ.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు సిద్ధమే: హనుమ విహారి
-
India News
Union Cabinet: 63వేల PACSల కంప్యూటరీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
-
Sports News
ENG vs IND: ఆ ‘తుపాన్’ మన మీదకొస్తే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా