Published : 20 May 2022 05:57 IST

కాశీ కణ కణంలోనూ శివుడు: కంగనా రనౌత్‌

వారణాసి: కాశీలోని కణ కణంలోనూ మహదేవుడు కొలువై ఉన్నాడని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ అన్నారు. గురువారం ఆమె తను నటించిన ‘ధాకఢ్‌’ సినీ బృందంతో కలిసి కాశీ విశ్వనాధుని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జ్ఞానవాపి మసీదు అంశంపై విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మథుర కణ కణంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. అయోధ్యలోని కణ కణంలో రాముడు ఉన్నాడు. అలానే కాశీ కణ కణంలోనూ మహాదేవుడు ఉన్నాడు. ఆయనకు ఓ నిర్మాణం అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె.. హర హర మహాదేవ్‌ అంటూ నినాదాలిచ్చారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని