కర్ణాటకలోని ముడి ఇనుము నిల్వల ఎగుమతికి సుప్రీం అనుమతి

కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల్లో మైనింగ్‌ కంపెనీలు తవ్వి నిల్వ ఉంచిన ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. కేంద్రం వైఖరిని పరిగణనలోకి తీసుకుంటూ ముడి ఇనుము

Published : 21 May 2022 05:23 IST

దిల్లీ: కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల్లో మైనింగ్‌ కంపెనీలు తవ్వి నిల్వ ఉంచిన ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. కేంద్రం వైఖరిని పరిగణనలోకి తీసుకుంటూ ముడి ఇనుము ఎగుమతిపై గతంలో న్యాయస్థానం విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లి ధర్మాసనం తెలిపింది. నిబంధనలను మైనింగ్‌ కంపెనీలు అతిక్రమించరాదని స్పష్టం చేసింది. ‘‘కర్ణాటకలోని 3 జిల్లాల్లో ఇప్పటికే తవ్వితీసిన ముడి ఇనుము నిల్వలను విక్రయించడానికి పిటిషనర్లకు అనుమతిస్తున్నాం. ఈ-వేలం విధానంలో కాకుండా నేరుగా విక్రయాలకు ఒప్పందం చేసుకోవచ్చు. కేంద్రం విధానాలకు లోబడి విదేశాలకు కూడా ముడి ఇనుమును ఎగుమతి చేయవచ్చు’’నని ధర్మాసనం పేర్కొంది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని