Published : 21 May 2022 05:23 IST

ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి

ఈనాడు, దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛైర్మన్‌గా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటుచేస్తూ కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2019 ఆగస్టు 9న ఏర్పాటైన మండలి కాలం పూర్తికావడంతో కొత్తగా దీన్ని ఏర్పాటుచేసింది. ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారులు, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆయా రాష్ట్రాల గవర్నర్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. అలాగే కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్‌ తోమర్, వీరేంద్ర కుమార్, హర్‌దీప్‌సింగ్‌ పూరీలను సభ్యులుగా నియమించారు. శాశ్వత ఆహ్వానితులుగా కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, జైశంకర్, అర్జున్‌ముండా, పీయూష్‌ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్‌ జోషి, అశ్వినీ వైష్ణవ్, గజేంద్రసింగ్‌ షెకావత్, కిరణ్‌ రిజిజు, భూపేంద్ర యాదవ్‌లకు అవకాశం కల్పించారు. 

అమిత్‌షా నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి స్థాయీసంఘం

కేంద్రహోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘాన్ని ఏర్పాటుచేస్తూ కేంద్రహోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గత స్థాయీసంఘం పదవీకాలం ముగిసినట్లు పేర్కొంది. ఇందులో సభ్యులుగా కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, నరేంద్రసింగ్‌ తోమర్, వీరేంద్ర కుమార్, గజేంద్రసింగ్‌ షెకావత్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులకు అవకాశం కల్పించారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల అంశాలను అంతర్రాష్ట్ర మండలిలో చర్చించడానికి ముందు ఈ స్థాయీసంఘంలో చర్చిస్తారు. కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయాల అమలుతీరును ఇది పర్యవేక్షిస్తుంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని