ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చౌటాలా దోషే: ప్రత్యేక కోర్టు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌటాలాను దిల్లీ ప్రత్యేక కోర్టు శనివారం దోషిగా తేల్చింది.

Published : 22 May 2022 05:47 IST

 

దిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌటాలాను దిల్లీ ప్రత్యేక కోర్టు శనివారం దోషిగా తేల్చింది. తదుపరి వాదనలు, శిక్ష ఖరారు కోసం విచారణను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వికాస్‌ ధుల్‌ ఈ నెల 26కు వాయిదావేశారు. చౌటాలాపై సీబీఐ 2005లో కేసు నమోదుచేసి.. 2010 మార్చి 26న అభియోగపత్రం దాఖలుచేసింది. చౌటాలా 1993-2006 మధ్య కాలంలో ఆదాయానికి మించి రూ.6.09 కోట్లు కూడబెట్టారనేది సీబీఐ అభియోగం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని