రక్షణ పరిజ్ఞానంలో స్వయం సమృద్ధి అవసరం: రాజ్‌నాథ్‌

ఆయుధ సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించడంపై దృష్టిపెట్టాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సూచించారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక పురోగతికి అనుగుణంగా ఇది సాగాలన్నారు.

Published : 23 May 2022 04:49 IST

నాగ్‌పుర్‌: ఆయుధ సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించడంపై దృష్టిపెట్టాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సూచించారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక పురోగతికి అనుగుణంగా ఇది సాగాలన్నారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, సైనిక, వైమానిక దళ ఉన్నతాధికారులు, ఆయుధ తయారీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆయుధ వ్యవస్థల నిర్వహణ విధానాలు సక్రమంగా ఉండాలని త్రివిధ దళాల కమాండర్లకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని