Published : 24 May 2022 05:03 IST

ఒడిశా నర్సింగ్‌ అధికారిణికి నైటింగేల్‌ అవార్డు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఒడిశా బ్రహ్మపురలోని ఎంకేసీజీ వైద్య కళాశాల ఆసుపత్రి నర్సింగ్‌ అధికారిణి శిబాని దాస్‌ ప్రతిష్ఠాత్మక జాతీయ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు-2021కు ఎంపికయ్యారు. త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. జాజ్‌పుర్‌ జిల్లా కంటాబొణియా గ్రామంలో జన్మించిన శిబాని.. లుచ్ఛాపడలో నివాసముంటున్నారు. 2007 నుంచి ఎంకేసీజీలో సేవలందిస్తున్న ఆమె అంతకుముందు కోల్‌కతాలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేశారు. 25 ఏళ్లుగా రోగుల సేవకు అంకితమైన శిబాని కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో శితలాపల్లి, ఎంకేసీజీలోని కరోనా ప్రత్యేక ఆసుపత్రుల్లో బాధితులకు విశేష సేవలందించి ప్రశంసలందుకున్నారు. రోగులకు నిస్వార్థ సేవ చేయడం లక్ష్యమని, అదే ఈ రోజు తనకు గుర్తింపునిచ్చిందని ఆమె ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని