Published : 24 May 2022 05:10 IST

వయసు 17 ఏళ్లు.. ఎత్తు 1.5 అడుగులు

అతిచిన్న మహిళగా రికార్డుల్లోకి ఎక్కనున్న సొనాలీ

భోపాల్‌: ప్రపంచంలోకెల్లా అతిచిన్న మహిళగా మధ్యప్రదేశ్‌లోని బడ్వానీ జిల్లాకు చెందిన సొనాలీ గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమ్దా గ్రామానికి చెందిన ఆమె వయసు 17 ఏళ్లు. ఎత్తు మాత్రం కేవలం 1.5 అడుగులు. జన్యులోపంతో పుట్టడం వల్ల ఆమె శారీరకంగా సరిగా ఎదగలేదు. చూస్తే కేవలం 1-2 ఏళ్ల పాపలా కనిపిస్తుంది. ఆమె సరిగా నిలబడలేదు. మాట్లాడలేదు.  ‘ప్రపంచంలోనే అతిచిన్న మహిళ’ రికార్డు ప్రస్తుతం మహారాష్ట్రకు చెందిన యువతి జ్యోతి ఆమ్గే పేరిట ఉంది. ఆమె ఎత్తు రెండు అడుగులు. సొనాలీ అంతకన్నా తక్కువ ఎత్తు ఉండడం గమనార్హం.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని