ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ కమిటీ ఛైర్‌పర్సన్‌గా రాజేశ్‌ భూషణ్‌

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ డబ్ల్యూహెచ్‌వోకు చెందిన కీలమైన కమిటీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. 194 దేశాలు సభ్యులుగా ఉన్న డబ్ల్యూహెచ్‌వో 75వ సమావేశాలు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలోఈ నెల 22న ప్రారంభమయ్యాయి.

Published : 25 May 2022 04:51 IST

దిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ డబ్ల్యూహెచ్‌వోకు చెందిన కీలమైన కమిటీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. 194 దేశాలు సభ్యులుగా ఉన్న డబ్ల్యూహెచ్‌వో 75వ సమావేశాలు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలోఈ నెల 22న ప్రారంభమయ్యాయి. 28 వరకు కొనసాగుతాయి. ఆరోగ్య రంగానికి సంబంధించిన సవాళ్లను ప్రతి ఏడాది వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ (డబ్ల్యూహెచ్‌ఏ) సమీక్షిస్తుంటుంది. రెండు కమిటీ(ఏ,బి)ల ద్వారా డబ్ల్యూహెచ్‌ఏ పనిచేస్తుంటుంది. వీటిలో రెండో కమిటీ ఛైర్‌పర్సన్‌గా రాజేశ్‌ భూషణ్‌ నియమితులయ్యారని డబ్ల్యూహెచ్‌వో ఒక ప్రకటనలో తెలిపింది. రాజేశ్‌ భూషణ్‌ నేతృత్వంలోని కమిటీ(బి)...ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించిన పరిపాలన, ఆర్థిక వ్యవహారాలను చర్చించి నివేదిక రూపొందిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని