అలహాబాద్‌ హైకోర్టుకు 10 మంది శాశ్వత జడ్జీలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టుకు 10 మంది శాశ్వత న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌లతో కూడిన కొలీజియం సిఫార్సు చేసింది. ఈ నెల

Published : 25 May 2022 04:51 IST

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టుకు 10 మంది శాశ్వత న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌లతో కూడిన కొలీజియం సిఫార్సు చేసింది. ఈ నెల 21న సమావేశమైన  కొలీజియం 10 మంది అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా ఎంపిక చేసింది. ఈ వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఉంచారు. కొత్త న్యాయమూర్తుల్లో జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ పచోరి, జస్టిస్‌ సుభాష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ సుభాష్‌ చాంద్‌, జస్టిస్‌ సరోజ్‌ యాదవ్‌, జస్టిస్‌ మహమ్మద్‌ అస్లాం, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ఓఝా, జస్టిస్‌ సాధనారాణి, జస్టిస్‌ సయ్యద్‌ ఆఫ్తాబ్‌ హుసేన్‌ రిజ్వీ, జస్టిస్‌ అజయ్‌ త్యాగి, జస్టిస్‌ అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని