ప్రజల పొదుపు సొమ్ముతో ఐపీఎల్‌ బెట్టింగ్‌!

భవిష్యత్తు అవసరాల కోసం ప్రజలు కూడబెట్టుకున్న సొమ్మును క్రికెట్‌ బెట్టింగ్‌కు వినియోగించాడో పోస్టుమాస్టర్‌. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో వెలుగు చూసింది. ఉన్నతాధికారుల ఫిర్యాదుతో నిందితుడు విశాల్‌ అహిర్వార్‌(36)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 26 May 2022 05:45 IST

రూ.1.25 కోట్లను దారి మళ్లించిన పోస్టుమాస్టర్‌

సాగర్‌: భవిష్యత్తు అవసరాల కోసం ప్రజలు కూడబెట్టుకున్న సొమ్మును క్రికెట్‌ బెట్టింగ్‌కు వినియోగించాడో పోస్టుమాస్టర్‌. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో వెలుగు చూసింది. ఉన్నతాధికారుల ఫిర్యాదుతో నిందితుడు విశాల్‌ అహిర్వార్‌(36)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కాలపరిమితి ముగియడంతో వాటిని తీసుకునేందుకు వచ్చిన ప్రజలు..అక్కడి సిబ్బంది ఇచ్చిన సమాధానంతో అవాక్కయ్యారు. డిపాజిట్‌ చేసిన మొత్తాల వివరాలేవీ పోస్టాఫీసులో లేవని సబ్‌ పోస్టాఫీసులోని సిబ్బంది తెలిపారు. దీంతో డబ్బు ఏమైందో ఆరా తీయగా...స్వల్పకాలంలో ధనాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో పోస్టుమాస్టరే ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో పెట్టారని తెలిసింది. డిపాజిటర్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విశాల్‌ అహిర్వార్‌ను అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అధిక లాభం వస్తుందనే ఆశతో ఐపీఎల్‌ బెట్టింగ్‌ రాకెట్‌ యాప్‌ ద్వారా ఆ మొత్తాన్ని వెచ్చించినట్లు వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని