నిబంధనలు ఉల్లంఘిస్తున్న పార్టీలపై ఈసీ చర్యలు

సేకరించిన విరాళాల వివరాలు సమర్పించకపోవడం, పేరు, చిరునామా, కార్యవర్గ సభ్యుల మార్పు తదితరాలను వెల్లడించకుండా నిబంధనలు ఉల్లంఘించిన రాజకీయ పార్టీలపై చర్యలకు ఉపక్రమించినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం వెల్లడించింది.

Published : 26 May 2022 05:45 IST

ఈనాడు, దిల్లీ: సేకరించిన విరాళాల వివరాలు సమర్పించకపోవడం, పేరు, చిరునామా, కార్యవర్గ సభ్యుల మార్పు తదితరాలను వెల్లడించకుండా నిబంధనలు ఉల్లంఘించిన రాజకీయ పార్టీలపై చర్యలకు ఉపక్రమించినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం వెల్లడించింది. పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ గుర్తింపు పొందని 2,100కు పైగా రాజకీయ పార్టీలపై ఈ చర్యలను తీసుకోబోతున్నట్లు తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలను పాటించకుండానే 2020 ఆర్థిక సంవత్సరంలో 66 పార్టీలు ఆదాయపు పన్ను మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయని ఈసీ పేర్కొంది. 2,174 పార్టీలు అవి సేకరించిన విరాళాల వివరాలను సమర్పించలేదని తెలిపింది. తీవ్రమైన ఆర్థిక అక్రమాలకు పాల్పడిన మూడు రాజకీయ పార్టీలపై ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. పేరు నమోదు చేసుకున్నప్పటికీ గుర్తింపు పొందని 87 పార్టీలు మనుగడలో లేవని, వాటిని జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఆ పార్టీలకు కేటాయించిన ఎన్నికల చిహ్నాలను రద్దు చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని