పనిచేసే మహిళల సంఖ్య పెరగాలి

మహిళల మొత్తం జనాభాకు, పనిచేసే స్త్రీల సంఖ్యకు మధ్య అంతరం ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉందంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సామాజిక

Published : 27 May 2022 05:24 IST

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆకాంక్ష

తిరువనంతపురం: మహిళల మొత్తం జనాభాకు, పనిచేసే స్త్రీల సంఖ్యకు మధ్య అంతరం ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉందంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సామాజిక దురభిప్రాయాల వల్ల దాదాపుగా ప్రపంచమంతటా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. పనిచేసే అతివల సంఖ్య గణనీయంగా పెరగాలని.. తదనుగుణంగా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని ఆకాంక్షించారు. ‘ఆజాదీ కా అమృతోత్సవ్‌’లో భాగంగా కేరళ అసెంబ్లీలో గురువారం ఏర్పాటుచేసిన జాతీయ మహిళా శాసనకర్తల సదస్సులో కోవింద్‌ ప్రారంభోపన్యాసం చేశారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో స్త్రీలు అత్యంత కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన అనేక ఆందోళనలు వారి విస్తృత భాగస్వామ్యం వల్లే విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. రాణీ లక్ష్మీబాయి, కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడు వంటి ప్రముఖుల సేవలను గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా పలు చట్టసభల్లో మహిళలకు మరింత ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలని ఆయన అభిలషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని