దేశంలో కొవిడ్‌ మరణాలు 1,60,618

దేశంలో 2020లో మృతి చెందిన వారిలో 8.9% మంది కొవిడ్‌ కారణంగా తనువు చాలించినట్లు కేంద్ర గణాంక విభాగం తాజాగా విడుదల చేసిన ‘మెడికల్‌ సర్టిఫికేషన్‌ ఆఫ్‌ కాజ్‌ ఆఫ్‌ డెత్‌-2020’

Published : 27 May 2022 05:24 IST

మొత్తం మృతుల్లో వాటా 8.9%

తెలంగాణలో 8.1%

ఈనాడు, దిల్లీ: దేశంలో 2020లో మృతి చెందిన వారిలో 8.9% మంది కొవిడ్‌ కారణంగా తనువు చాలించినట్లు కేంద్ర గణాంక విభాగం తాజాగా విడుదల చేసిన ‘మెడికల్‌ సర్టిఫికేషన్‌ ఆఫ్‌ కాజ్‌ ఆఫ్‌ డెత్‌-2020’ నివేదిక వెల్లడించింది. సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టంలో నమోదైన లెక్కల ప్రకారం 2020లో మొత్తం 80,62,700 మంది చనిపోగా అందులోని 18,11,688 మరణాలను(22.5%) వైద్యపరంగా ధ్రువీకరించారు. ఇందులో 1,60,618 మంది కొవిడ్‌ కారణంగా చనిపోయినట్లు తేల్చారు. మొత్తం మరణాల్లో రక్త ప్రసరణ (సర్క్యులేటరీ సిస్టం) సమస్యలతో 5,80,751 మంది, శ్వాసకోశ సమస్యలతో 1,81,160 మంది చనిపోగా, మూడోస్థానంలో కొవిడ్‌ రోగులు నిలిచారు. తెలంగాణలో 2,03,127 మంది చనిపోగా అందులో 30.9% మరణాలను వైద్యపరంగా ధ్రువీకరించారు. తెలంగాణ జాతీయ సగటుకంటే ఎక్కువగా 15వ స్థానంలో నిలిచింది. వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాల్లో తెలంగాణలో 8.1% మంది కొవిడ్‌తో మృతి చెందారు.  ఈ మృతుల్లో 31.9% మందికే మరణించే ముందు వైద్య సౌకర్యాలు అందాయి. తెలంగాణలోని 9.6% ఆసుపత్రులు మాత్రమే మరణాలను ధ్రువీకరించాయి. పెద్దరాష్ట్రాల్లో మరణాల ధ్రువీకరణలో తమిళనాడు(43%), మహారాష్ట్ర(42.8%) తర్వాతి స్థానాన్ని తెలంగాణ (30.9%) ఆక్రమించింది. నియోప్లాజమ్‌ (కణితి, గడ్డల పెరుగుదల) మరణాలు తెలంగాణలో(19.1%) అత్యధికంగా ఉన్నాయి. గాయాలు, విషప్రభావం, ఇతర బాహ్యకారణాలతో తెలంగాణలో 11% మరణాలు సంభవించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని