కొబ్బరినీళ్లు, జొన్నరొట్టె.. జైలులో సిద్ధూకు ప్రత్యేక ఆహారం

వాహనం అడ్డు తీయమని కోరిన వృద్ధుడిపై దాడి చేసి, అతడి మరణానికి కారణమైన కేసులో దోషిగా పటియాలా కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత నవజోత్‌సింగ్‌

Updated : 27 May 2022 06:08 IST

చండీగఢ్‌: వాహనం అడ్డు తీయమని కోరిన వృద్ధుడిపై దాడి చేసి, అతడి మరణానికి కారణమైన కేసులో దోషిగా పటియాలా కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత నవజోత్‌సింగ్‌ సిద్ధూ(58)కు వైద్యుల సలహా మేరకు ప్రత్యేక ఆహారం అందిస్తున్నారు. చక్కెర పదార్థం (లాక్టోస్‌) తీసిన పాలు, కీరా, జొన్నరొట్టె, కొబ్బరినీళ్లు, పళ్లరసం, బాదం వంటివి ఇందులో ఉన్నట్లు జైలు అధికారి తెలిపారు. జైలులో గుమాస్తా పని చేసేందుకుగాను సిద్ధూను ‘మున్షీ’(సహాయకుడు)గా నియమించారు. మూడు నెలలపాటు ట్రైనీగా పరిగణించి, ఆ తర్వాత రోజుకు రూ.40 నుంచి రూ.90 మధ్య జీతం ఇస్తామన్నారు. పటియాలాలోని రాజీంద్ర ఆసుపత్రిలో మే 23న సిద్ధూకు అన్ని పరీక్షలు చేశాక, వైద్యుల బృందం ప్రత్యేక ఆహారాన్ని సిఫార్సు చేసింది.సిద్ధూ ఎంబోలిజం (రక్తనాళంలో రక్తం గడ్డకట్టడం), కాలేయవ్యాధులతో బాధపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని