పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌కు మమత షాక్‌

పశ్చిమ బెంగాల్‌లో సీఎం, గవర్నర్ల మధ్య నెలకొన్న వివాదం మరో స్థాయికి చేరింది. రాష్ట్ర యూనివర్సిటీల కులపతిగా గవర్నర్‌ను తొలగించి.. ఆ స్థానంలో సీఎంను నియమించేలా రూపొందించిన

Published : 27 May 2022 05:24 IST

ఇకపై కులపతి హోదా ముఖ్యమంత్రిదే!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో సీఎం, గవర్నర్ల మధ్య నెలకొన్న వివాదం మరో స్థాయికి చేరింది. రాష్ట్ర యూనివర్సిటీల కులపతిగా గవర్నర్‌ను తొలగించి.. ఆ స్థానంలో సీఎంను నియమించేలా రూపొందించిన ముసాయిదా చట్టానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ల మధ్య తీవ్ర అభిప్రాయభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో బెంగాల్‌ ప్రభుత్వం ఈ కీలక ముసాయిదా బిల్లును రూపొందించింది. బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యబసు తెలిపారు. ఈ బిల్లు అమలులోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 17 యూనివర్సిటీలపై గవర్నర్‌ అధికారం కోల్పోతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని