కొవాగ్జిన్‌కు జర్మనీ గుర్తింపు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) రూపొందించిన జాబితాలో ఉన్న కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను ప్రయాణ అవసరాల కోసం గుర్తించనున్నట్లు జర్మనీ ప్రకటించింది. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన

Published : 27 May 2022 05:24 IST

1 నుంచి ప్రయాణ అవసరాలకు అనుమతి

హైదరాబాద్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) రూపొందించిన జాబితాలో ఉన్న కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను ప్రయాణ అవసరాల కోసం గుర్తించనున్నట్లు జర్మనీ ప్రకటించింది. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ఈ టీకాను తీసుకున్నవారు తమ దేశానికి రావచ్చని భారత్‌లోని జర్మనీ రాయబారి వాల్టెర్‌ జె లిండ్నెర్‌ గురువారం ట్వీట్‌ చేశారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం కోసం తాము గత కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న ప్రయాణికుల్ని ఆస్ట్రేలియా, జపాన్‌, కెనడా వంటి అనేక దేశాలు ఇప్పటికే అనుమతిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని