నేడు నింగిలోకి ‘ఆర్‌హెచ్‌-200’ రాకెట్‌

‘యువ విజ్ఞాన కార్యక్రమం-2022’ విద్యార్థుల వీక్షణ కోసం షార్‌లోని ప్రయోగ కేంద్రం నుంచి ఆర్‌హెచ్‌-200 సౌండింగ్‌ రాకెట్‌ను శుక్రవారం నింగిలోకి పంపనున్నారు. శిక్షణలో భాగంగా

Published : 27 May 2022 05:24 IST

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: ‘యువ విజ్ఞాన కార్యక్రమం-2022’ విద్యార్థుల వీక్షణ కోసం షార్‌లోని ప్రయోగ కేంద్రం నుంచి ఆర్‌హెచ్‌-200 సౌండింగ్‌ రాకెట్‌ను శుక్రవారం నింగిలోకి పంపనున్నారు. శిక్షణలో భాగంగా విద్యార్థులు గురువారం ఇక్కడికి చేరుకున్నారు. వీరికి రెండ్రోజులపాటు వివిధ అంశాలపై సీనియర్‌ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించనున్నారు. షార్‌ సంచాలకులు ఆర్ముగం రాజరాజన్‌ రాకెట్‌ కేంద్రం, ప్రయోగాలు, అనుసంధానం తదితర అంశాల గురించి వివరించనున్నారు. శనివారం ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌ విద్యార్థుల ముఖాముఖిలో పాల్గొని వారి అనుమానాలను నివృత్తి చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని