ఫరూఖ్‌ అబ్దుల్లాకు ఈడీ సమన్లు

జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్సు (ఎన్సీ) అధ్యక్షుడు డాక్టర్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా (84)కు ఈడీ సమన్లు జారీ చేసింది. హవాలా కేసు విచారణకుగాను మే 31న తమ కార్యాలయంలో

Published : 28 May 2022 05:18 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్సు (ఎన్సీ) అధ్యక్షుడు డాక్టర్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా (84)కు ఈడీ సమన్లు జారీ చేసింది. హవాలా కేసు విచారణకుగాను మే 31న తమ కార్యాలయంలో హాజరుకావలసిందిగా ఆయన్ను కోరినట్లు అధికారవర్గాలు శుక్రవారం వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (జేకేసీఏ) ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఈ కేసును ఈడీ విచారిస్తోంది. ఆర్థిక అక్రమాల నిరోధక చట్టం కింద ఈ కేసు నమోదైంది. శ్రీనగర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫరూఖ్‌ అబ్దుల్లా గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా అధికారవర్గాలకు సహకరిస్తారని పార్టీవర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని