చౌటాలాకు నాలుగేళ్ల జైలుశిక్ష

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌటాలా (87)కు శుక్రవారం దిల్లీ కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. 1993 - 2006 మధ్యకాలంలో అక్రమ ఆస్తుల సేకరణకు పాల్పడినందుకుగాను చౌటాలాకు రూ.50

Published : 28 May 2022 05:18 IST

హరియాణా మాజీ సీఎంపై 17 ఏళ్లు నడిచిన సీబీఐ కేసు

దిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌటాలా (87)కు శుక్రవారం దిల్లీ కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. 1993 - 2006 మధ్యకాలంలో అక్రమ ఆస్తుల సేకరణకు పాల్పడినందుకుగాను చౌటాలాకు రూ.50 లక్షల జరిమానా కూడా విధించారు. ఆయన స్వాధీనంలో ఉన్న నాలుగు ఆస్తులను జప్తు చేయాలని ప్రత్యేక జడ్జి వికాస్‌ ధుల్‌ అధికారులను ఆదేశించారు. తనకున్న ఆస్తులకు సరిపడా లెక్కలు చూపడంలో విఫలమైన చౌతాలను దోషిగా గత వారం కోర్టు నిర్ధారించింది. ఈయనపై 2005లో కేసు నమోదు చేసిన సీబీఐ 2010లో ఛార్జిషీటు దాఖలు చేసింది. 1999 జులై 24 నుంచి 2005 మార్చి 5వ తేదీ వరకు చౌటాలా హరియాణా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతల్లో ఉన్నారు. ఈ సమయంలో తన పేరిట, కుటుంబసభ్యుల పేరిట అక్రమ ఆస్తుల సేకరణకు పాల్పడినట్లు సీబీఐ ఎఫ్‌.ఐ.ఆర్‌.లో పేర్కొంది. ఈ ఆస్తుల విలువ రూ.6.09 కోట్లుగా గుర్తించారు. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు చౌటాలాను తిహాడ్‌ జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని