కోడలు తప్పుడు కేసు పెట్టిందని ఉత్తరాఖండ్‌ మాజీ మంత్రి బలవన్మరణం

మనవరాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ తన కోడలు కేసు పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి లోనై.. ఉత్తరాఖండ్‌ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ (59) బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. తన స్వస్థలమైన హల్దానీ నగరంలో వాటర్‌ ట్యాంకు పైకిఎక్కి తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సీనియర్‌ ఎస్పీ పంకజ్‌ భట్‌ తెలిపారు. అంతకుముందు రాజేంద్ర తాను

Published : 28 May 2022 06:02 IST

దేహ్రాదూన్‌: మనవరాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ తన కోడలు కేసు పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి లోనై.. ఉత్తరాఖండ్‌ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ (59) బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. తన స్వస్థలమైన హల్దానీ నగరంలో వాటర్‌ ట్యాంకు పైకిఎక్కి తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సీనియర్‌ ఎస్పీ పంకజ్‌ భట్‌ తెలిపారు. అంతకుముందు రాజేంద్ర తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే వాటర్‌ట్యాంక్‌ పైకి ఎక్కిన రాజేంద్రతో పోలీసులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆయన పదేపదే ఆవేదనగా తెలిపారు. ఒకదశలో ఆయన మెత్తబడి కిందకు దిగినట్లే కనిపించినా.. అంతలోనే తన ఛాతిభాగంపై కాల్చుకుని అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అంతకు 3 రోజుల క్రితం రాజేంద్ర కోడలు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని