Published : 29 May 2022 05:02 IST

ప్రార్థనా స్థలాల చట్టంలో రాజ్యాంగ విరుద్ధ సెక్షన్లు

చెల్లుబాటును సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్‌ 

దిల్లీ: ప్రార్థనా స్థలాల చట్టం-1991లోని కొన్ని సెక్షన్ల చెల్లుబాటును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలైంది. అవి రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, చట్టం ముందు అందరూ సమానమేనన్న భావనను ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్‌ పేర్కొన్నారు. మతం, వర్గం, కులం, స్త్రీ-పురుష, పుట్టిన ప్రాంతం వంటి అంశాల ఆధారంగా వివక్ష చూపరాదన్న నిబంధనలను ఇవి వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురకు చెందిన దేవకీనందన్‌ ఠాకుర్‌ ఈ పిటిషన్‌ వేశారు. ఈ చట్టం ద్వారా.. 1947 ఆగస్టు 15 నాటికి దేశంలో ఉన్న ప్రార్థనా స్థలాల మతపరమైన తీరుతెన్నులను కోర్టుల్లో దావాలు వేయడం ద్వారా మార్చరాదని కేంద్రం నిర్దేశించిందని దావాలో పేర్కొన్నారు. అయితే తమకు సంబంధించిన ప్రార్థనా స్థలాలను తిరిగి పొందేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు హిందువులు, జైన్‌లు, బౌద్ధులు, సిక్కులకున్న హక్కును ఇది హరిస్తోందన్నారు. అందువల్ల ఆ చట్టంలోని 2, 3, 4, సెక్షన్ల చెల్లుబాటును ఆయన ప్రశ్నించారు. న్యాయ సమీక్ష మార్గాన్ని అడ్డుకోవడం ద్వారా కేంద్రం తన శాసనాధికార పరిధిని అతిక్రమించిందని తెలిపారు. ‘‘శ్రీకృష్ణ జన్మభూమి పునరుద్ధరణ కోసం హిందువులు వందల ఏళ్లుగా శాంతియుతంగా పోరాడుతున్నారు. ఆ చట్టాన్ని చేసే సమయంలో అయోధ్యలో శ్రీరాముడి జన్మభూమిని కేంద్రం మినహాయించింది. మథురలో కృష్ణుడి ఆలయానికి ఆ వెసులుబాటు ఇవ్వలేదు’’ అని పిటిషన్‌లో దేవకీనందన్‌ పేర్కొన్నారు.  

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని