Published : 29 May 2022 05:02 IST

ఇండిగో సంస్థకు రూ.5 లక్షల జరిమానా

 విమానంలోకి దివ్యాంగ బాలుడిని నిరాకరించిన ఘటనలో డీజీసీఏ కొరడా

దిల్లీ: దివ్యాంగ బాలుడిని విమానంలోకి రానివ్వని ఉదంతంలో ఇండిగో సంస్థపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) కొరడా ఝుళిపించింది. ఆ సంస్థకు రూ.5 లక్షలు జరిమానా విధించింది. మే 7న హైదరాబాద్‌ వెళ్లేందుకు దివ్యాంగ బాలుడితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే.. ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సంస్థ నిరాకరించింది. దీనిపై విమర్శలు రావడంతో వివరణ కూడా ఇచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన డీజీసీఏ.. వివరణ ఇవ్వాలంటూ ఇండిగో సంస్థకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. బాలుడి పట్ల సానుభూతితో వ్యవహరించి ఉంటే.. సమస్య పరిష్కారమయ్యేదని.. ఈ విషయంలో సిబ్బంది విఫలమయ్యారని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన దృష్ట్యా ఇండిగో సంస్థకు జరిమానా విధించినట్లు శనివారం డీజీసీఏ తెలిపింది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని