రూ.35 కోసం ఒకే ఒక్కడి అయిదేళ్ల పోరాటం.. 2.98లక్షల మందికి లబ్ధి!

రైల్వే టికెట్‌పై రావాల్సిన రూ.35 రీఫండ్‌ కోసం ఓ వ్యక్తి అయిదేళ్ల పాటు చేసిన పోరాటం సుమారు 3 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. రాజస్థాన్‌లోని కోటకు చెందిన ఇంజినీర్‌ సుజీత్‌ స్వామి 2017 జులై 2న కోట నుంచి దిల్లీకి ప్రయాణించేందుకు

Updated : 31 May 2022 08:35 IST

కోట: రైల్వే టికెట్‌పై రావాల్సిన రూ.35 రీఫండ్‌ కోసం ఓ వ్యక్తి అయిదేళ్ల పాటు చేసిన పోరాటం సుమారు 3 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. రాజస్థాన్‌లోని కోటకు చెందిన ఇంజినీర్‌ సుజీత్‌ స్వామి 2017 జులై 2న కోట నుంచి దిల్లీకి ప్రయాణించేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా ఏప్రిల్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. ఆ టికెట్‌ ధర రూ.765 కాగా.. ఆ తర్వాత ప్రయాణాన్ని రద్దు చేసుకోగా.. రద్దు (క్యాన్సిలేషన్‌) రుసుం  కింద రూ.65 మాత్రమే తీసుకోవాల్సి ఉండగా రూ.100 మినహాయించుకున్నారు. 2017 జులై 1న జీఎస్టీ అమలులోకి రాగా.. దానికి ముందే తాను టికెట్‌ను రద్దు చేసుకున్నప్పటికీ సేవా రుసుం కింద రూ.35 వసూలు చేయడంపై స్వామి పోరాటానికి నడుం బిగించారు. రైల్వేకు, ఐఆర్‌సీటీసీకి, ఆర్థిక శాఖకు, సేవా పన్నుల శాఖకు ఆర్టీఐ కింద సుమారు 50 అర్జీలు పెట్టారు. దీంతో రూ.35 తిరిగి చెల్లించేందుకు ఐఆర్‌సీటీసీ అంగీకరించింది. కానీ, 2019 మే 1న అతని బ్యాంకు ఖాతాలో రూ.33 మాత్రమే జమయ్యాయి. మిగిలిన రూ.2 కోసమూ స్వామి పట్టుబట్టారు. దాని కోసం మరో మూడేళ్ల పాటు పోరాడారు. దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన రైల్వే.. ఆయనకు సదరు రెండు రూపాయలు ఇవ్వడంతో పాటు.. 2.98 లక్షల మంది వినియోగదారులకు ప్రతి టికెట్‌పై రూ.35 చొప్పున మొత్తం రూ.2.43 కోట్ల తిరిగి చెల్లించేందుకు అంగీకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని