ఇష్టమైన ట్రాక్టరుపై మూసేవాలా అంతిమయాత్ర

ముఠా గొడవల్లో గత ఆదివారం దుండగులు కాల్చిచంపిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా (28) అంత్యక్రియలు మన్సా జిల్లాలోని స్వగ్రామం మూసాలో మంగళవారం జరిగాయి.

Published : 01 Jun 2022 05:07 IST

మన్సా (పంజాబ్‌): ముఠా గొడవల్లో గత ఆదివారం దుండగులు కాల్చిచంపిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా (28) అంత్యక్రియలు మన్సా జిల్లాలోని స్వగ్రామం మూసాలో మంగళవారం జరిగాయి. సిద్ధూకు ఇష్టమైన ట్రాక్టరుపై అంతిమయాత్ర కొనసాగగా, వేలాది మంది అభిమానులు వెంట నడిచి కన్నీటి నివాళులు అర్పించారు. తల్లిదండ్రులు ఇద్దరూ ముకుళిత హస్తాలతో కుమారుడి మృతదేహం పక్కన నిలుచున్నారు. అభిమానుల్లో కొందరు సిద్ధూ బొమ్మ ఉన్న టీషర్టులు ధరించారు. ఉదయం గట్టి భద్రత నడుమ ఆసుపత్రి నుంచి సిద్ధూ స్వగృహానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. అభిమాన గాయకుణ్ని కడచూపు చూసేందుకు పంజాబ్‌తోపాటు రాజస్థాన్, చండీగఢ్‌ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అమరీందర్‌ సింగ్‌ రాజా అంతిమయాత్రలో పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని