Mayasri: రోడ్లపై యాచించిన ఓ హిజ్రా.. డ్రోన్‌ శిక్షకురాలిగా..

తినేందుకు భోజనం లేక రోడ్లపై యాచించిన ఓ హిజ్రా.. డ్రోన్‌ శిక్షకురాలిగా ఉద్యోగం పొందడంతోపాటు భారత్‌ డ్రోన్‌ మహోత్సవ్‌లో పలు కంపెనీల సీఈవోలతో చర్చలో పాల్గొన్నారు. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన 24 ఏళ్ల మాయాశ్రీ

Published : 04 Jun 2022 09:56 IST

భారత్‌ డ్రోన్‌ మహోత్సవ్‌ చర్చావేదికలో పాల్గొన్న తొలి హిజ్రా

ఈనాడు, చెన్నై: తినేందుకు భోజనం లేక రోడ్లపై యాచించిన ఓ హిజ్రా.. డ్రోన్‌ శిక్షకురాలిగా ఉద్యోగం పొందడంతోపాటు భారత్‌ డ్రోన్‌ మహోత్సవ్‌లో పలు కంపెనీల సీఈవోలతో చర్చలో పాల్గొన్నారు. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన 24 ఏళ్ల మాయాశ్రీ చెన్నైలో స్థిరపడ్డారు. ఎల్‌జీబీటీక్యూ వర్గానికి చెందినప్పటికీ తపనతో చదువుకున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్‌ పాసయ్యారు. అయితే ఉపాధి పొందడం బాగా కష్టమైంది. కొన్ని నెలల క్రితం రోజువారీ భోజనం కోసం చెన్నై వీధుల్లో యాచించారు. మాయాశ్రీ ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతుండటం, ప్రతిభను గుర్తించిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విశ్రాంత వింగ్‌ కమాండర్‌ కేఆర్‌ శ్రీకాంత్‌ ఆమెను ప్రోత్సహించారు. డ్రోన్‌ శిక్షణ కోసం పంపించారు. ఇండియన్‌ ఆయిల్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో వీరికి శిక్షణ ఇప్పించింది. దీంతో ఆరు నెలల్లో మాయాశ్రీ జీవితమే మారిపోయింది. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఏరోస్పేస్‌ రీసెర్చి కేంద్రం (సీఏఎస్‌ఆర్‌)లో రిమోట్‌ పైలట్‌ ట్రైనింగ్‌ ఆర్గనేషన్‌ (ఆర్‌పీటీవో) తరఫున డ్రోన్‌ పైలట్‌గా, శిక్షకురాలిగా అర్హత సాధించారు. ప్రస్తుతం దక్ష అన్‌మ్యాన్డ్‌ సిస్టమ్స్‌ సంస్థలో శిక్షకురాలిగా ఉన్నారు. తాజాగా దిల్లీలో డ్రోన్‌ మహోత్సవ్‌లో పాల్గొని ఆకట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని