నుపుర్‌ శర్మకు ముంబయి పోలీసుల సమన్లు

మహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై ముంబయి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Published : 12 Jun 2022 05:36 IST

25న వాంగ్మూలమివ్వాలని ఆదేశం

ముంబయి: మహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై ముంబయి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఈ నెల 25న ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాల్సిందిగా పైధోనీ పోలీస్‌ స్టేషన్‌ నుంచి సమన్లు జారీ చేసినట్లుగా పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. ప్రవక్తపై వ్యాఖ్యలకు గాను భాజపా నుంచి బహిష్కృతుడైన నవీన్‌ కుమార్‌ జిందాల్‌పై పుణె నగర పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ కొంద్వా పోలీస్‌ స్టేషన్‌లో ఒక వ్యక్తి ఫిర్యాదు చేయగా ఈ చర్య తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం నుపుర్‌శర్మపై కూడా ఫిర్యాదు రాగా ఇదే పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని