ఈడీ ముందుకు నేడు రాహుల్‌

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరుకానున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఉదయం 9.30 గంటలకు

Published : 13 Jun 2022 04:25 IST

దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్‌ పిలుపు

దిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరుకానున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఉదయం 9.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి రాహుల్‌ ఈడీ కార్యాలయానికి బయల్దేరే అవకాశం ఉంది. ఆ సమయంలో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్‌ సీఎంలు, పార్లమెంట్‌ సభ్యులు, వర్కింగ్‌ కమిటీ సభ్యులు పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి వీరంతా రాహుల్‌తో ఈడీ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. మరోవైపు దేశంలోని ముఖ్య ప్రాంతాల్లో ప్రదర్శనలు జరిపి, విలేకరుల సమావేశాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాల ముందు నిరసన చేపట్టాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చింది. రాహుల్‌కి సంఘీభావం తెలిపేందుకు తాను దిల్లీ వెళుతున్నట్లు ఆదివారం ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ తెలిపారు. రాజస్థాన్‌ సీఎం గహ్లోత్‌ కూడా తాను దిల్లీ వెళ్లి నిరసన ర్యాలీలో పాల్గొంటానని పేర్కొన్నారు.

కేంద్రానివి ప్రతీకార రాజకీయాలు

రాహుల్‌కి ఈడీ సమన్లు పంపడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆదివారం కేంద్రంపై ధ్వజమెత్తారు. భాజపా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాహుల్‌పై నగదు అక్రమ చలామణీ కేసు మోపటం హాస్యాస్పదంగా ఉందని పి.చిదంబరం పేర్కొన్నారు. రాజకీయంగా సోనియా, రాహుల్‌పై ఒత్తిడి పెంచడానికే కేంద్రం ఈ చర్యలకు పాల్పడుతోందని దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని